హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎబివిపి చలో ఓయు ఉద్రిక్తం: ఉస్మానియాను చుట్టుముట్టిన విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఎబివిపి ఇచ్చిన చలో ఓయు పిలుపు మంగళవారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది విద్యార్థులు వివిధ రహదారుల గుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకు వెళుతున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇచ్చిన చలో ఓయు పిలుపు మేరకు మంగళవారం భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

వారంతా ఒకవైపునుండి రాలేదు. శివం రోడ్డునుండి, తార్నాక నుండి, లేడీస్ హాస్టల్ వెనుక వైపు నుండి వస్తున్న విద్యార్థులు పోలీసు స్టేషన్‌ ముందు ధర్నాకు ప్రయత్నాలు చేశారు. పోలీసుల కళ్లుగప్పి సుమారు 400 మంది విద్యార్థులు ఉస్మానియాలోకి చొచ్చుకెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు పోలీసు స్టేషన్ వద్ద విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X