వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను తలుచుకుంటే కాంగ్రెసు ప్రభుత్వం ఢమాల్: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: ఢిల్లీలో జలదీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు అధిష్టానానికి ఆయన సవాల్ విసిరారు. తాను తలుచుకుంటే కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను జెంటిల్మన్‌ను కాబట్టి తాను తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులను రాజీనామా చేయాలని అడగడం లేదని ఆయన అన్నారు. తాను తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆయన హెచ్చరించారు. తాను మంచివాడిని కాబట్టే తన మద్దతుదారులైన శాసనసభ్యులను రాజీనామా చేయాలని అడగడం లేదని ఆయన అన్నారు.

తన మద్దతుదారులైన శాసనసభ్యుల అవసరం కాంగ్రెసు పార్టీకి ఉందని, అందువల్లనే వారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసును ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో తన మద్దతుదారులు తన పార్టీ మీదనే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తాను పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X