విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేల బేరం: జగన్‌ పై చంద్రబాబు ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: అవినీతి సొమ్ము వెదజల్లి ఇతర పార్టీల శాసనసభ్యులను, నేతలను మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కొంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో విమర్శించారు. ఓబుళాపురం గనుల అవినీతి వ్యవహారంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. జలయజ్ఞం, భూములు, సెజ్‌ల పేరిట ఆ కుటుంబలం లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. చిత్తశుద్ధితో జలయజ్ఞం చేస్తే సహకలిస్తామని, అవినీతికు పాల్పడితే మీ గుండెల్లో నిద్ర పోతామని ఆనాడే వైయస్‌కు చెప్పానని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ఘనత ఒక్క వైయస్‌దేనని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవగాహన వల్ల పాలన కుంటుపడుతోందన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై అఖిలపక్షం వేయకపోవడం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతకానితనానికి నిదర్శనమన్నారు. బ్రజేష్ కమిటీ తీర్పు వల్ల రాష్ట్రంలో పంట ఆలస్యం కావడమే కాకుండా ఒక పంట పూర్తిగా నష్టపోతామన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెసు ప్రభుత్వం చేతకాని తనం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో, దేశంలో అనిశ్చితి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని విమర్శించారు.

కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో పేదవాడు పండుగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. పేదవాడు బతకలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వాల అవినీతి వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే కృష్ణా నది నీటిలో మన వాటా దక్కిందన్నారు. మిగులు జలాలు రాష్ట్రానికి అవసరం లేదని వైయస్ లేఖ రాయడం వల్లే మనకు నీళ్లు రాకుండా పోయాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X