హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోక ముడిచిన జగన్: లోకేష్ స్టూడియో ఎన్‌ లో కథనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: జలదీక్ష పేరుతో న్యూఢిల్లీలో బలదీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ ‌రెడ్డి చలి దాటికి తట్టుకోలేకే దీక్షను అర్థాంతరంగా ముగించారని లోకేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని స్టూడియో ఎన్ ఛానల్‌లో ప్రసారం చేశారు. లక్ష్యదీక్షలాగే తూతూ మంత్రంగా జలదీక్షను చేపట్టారని ఆరోపించింది. బ్రేక్‌ ఫాస్టుకు డిన్నర్ మధ్య జగన్ జలదీక్ష చేపట్టారంటూ పరోక్షంగా ఒక్కపూట ఉపవాసమంటూ వ్యాఖ్యానించింది. రాత్రి దీక్ష పూర్తి కాగానే అందరూ బిర్యానీ, మందు కోసం ఎదురు చూస్తున్నారంది. ఢిల్లీలో ఎక్కువగా ఉండే చలికి భయపడే జగన్ ఒక్కరోజులోనే దీక్షకు చాప చూట్టేశారంది. జగన్‌కు రైతులపై ఉన్న ప్రేమ ఒక్కపూట దీక్షేనా అని ప్రశ్నించింది.

ఒక్కరోజు దీక్షను అలా ఉంచితే ప్రభుత్వం ఆయన పెట్టిన డిమాండ్లపైన ఒక్కదానిపైన అయినా దిగి వచ్చిందీ లేదు, జగన్‌తో చర్చలు జరిపిందీ లేదు, ప్రభుత్వంనుండి స్పష్టమైన హామీ ఏదీ పొందనప్పుడు ఆయన దీక్షకు ఎందుకు పూనుకున్నట్టు అని ప్రశ్నించింది. జగన్ దీక్ష మొత్తం ఒక డ్రామాలాగ సాగిందన్నారు. అసలు జగన్ దీక్ష ఎవరిని కదిలించింది అని ప్రశ్నించింది. 24 గంటలు దీక్ష చేస్తానన్న కడప మాజీ ఎంపీ చలికి తట్టుకోలేక తోకముడిచాడని, అలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించింది.

కాగా 24 గంటల దీక్షను ప్రకటించిన జగన్ పది గంటలలోనే ముగించాడు. పోలీసులు అడ్డుకున్నారనే సమాధానం చెప్పాలనుకుంటే ముందే వారి చెప్పిన సమయంలో దీక్షను పూర్తి చేయాలి, లేదా వారు బలవంతంగా అరెస్టు చేసే వరకు చూడాలి. కానీ ఆయన తనంత తానే దీక్షను విరమిస్తున్నట్టు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చెప్పారు. దీంతో పలువురు జగన్ దీక్షను కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్ చేపట్టిన జలదీక్ష తనకున్న బలాన్ని అధిష్టానం ముందు ప్రదర్శించడానికే అని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అత్యంత చలిగా ఉండే ఢిల్లీలో అప్పటికే పోలీసులు వాటర్ క్యానన్‌లతో రెడీగా ఉన్నారు. వారు ఏ సమయంలోనైనా అవి ఉపయోగించడానికి సిద్ధంగా ఉండటంతో జగన్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X