వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ నటి వనితకు ఊరట: ఆకాశ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vanitha
న్యూఢిల్లీ: తన కుమారుడు విజయ్ శ్రీహరి కస్టడీ విషయంలో తమిళ సినీ నటి వనితకు ఊరట లభించింది. మద్రాసు కోర్టులో శ్రీహరి వ్యవహారంపై నడుస్తున్న కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ వనిత తండ్రి, తమిళ నటుడు విజయ్ కుమార్ అల్లుడు ఆకాశ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో వనితకు ఊరట లభించింది. తన తండ్రి విజయ్ కుమార్ తన కూమారుడిని కిడ్నాప్ చేశారని వనితి కేసు వేసింది. ఆకాశ్‌తో వనిత విడాకులు తీసుకుని తన కుమారుడి కోసం పోరాటం చేస్తోంది.

కుమారుడికి న్యాయపరమైన సంరక్షుకురాలు తల్లి అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు వనిత చెప్పారు. కుమారుడిని తనకు అప్పగించాలని కూడా కోర్టు చెప్పిందని ఆమె అన్నారు. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆకాశ్ తన తండ్రి విజయ్ కుమార్ చెంత చేరాడని ఆమె ఆరోపించారు. ఆకాశ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం తనకు న్యాయం జరిగినట్లేనని ఆమె అన్నారు. తన వైపు న్యాయం ఉందని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X