వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదకర జల్లికట్టు ప్రారంభం: ఎద్దులతో పోరాటానికి తరలి వచ్చిన జనం
ఈ ఆట చాలా ప్రమాదకరమైనది. కొన్ని సందర్భాల్లో ఆటలో పాల్గొన్న వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ప్రాణాపాయమని తెలిసినప్పటికీ యువకులు ఆటకోసం ముందుకు రావడం గమనార్హం. చాలామంది ఈ ఆటలో గాయపడుతుంటారు. ఈ ఆటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎంతో కాలంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతోంది. ప్రభుత్వం దీన్ని నిషేదించడంతో పోలీసులు దానిని అడ్డుకుందామని చూడటం గ్రామస్తులు ఒప్పుకోక పోవటం జరుగుతూనే ఉంది. ఏటా జరిగినట్టే ఈ సారీ పోలీసులు భారీగా తరలి వచ్చారు. స్థానికులకు చెప్పి చూశారు. వినక పోవటంతో రక్షణాత్మక చర్యలకోసం అక్కడే మోహరించారు.
Comments
ఆంధ్రప్రదేశ్ జల్లికట్టు తమిళనాడు ఎద్దు సంక్రాంతి పండుగ andhra pradesh jallikattu tamilnadu sankranthi festival
Story first published: Sunday, January 16, 2011, 15:50 [IST]