హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంతో జగన్ వర్గం ఎమ్మెల్యే భేటీ!:దీక్షపై వివరణ ఇచ్చే ఛాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వర్గం ప్రత్తిపాడు శాసనసభ్యురాలు ఎం.సుచరిత సోమవారం సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. జగన్ ఈ నెల 11న దేశ రాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన ఒక్కరోజు జలదీక్షలో సుచరిత పాల్గొన్నారు. ఆమె సోమవారం ముఖ్యమంత్రిని కలిసి తాను జగన్ దీక్షలో పాల్గొన్న ఘటనపై వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై కాంగ్రెసు అధిష్టానంతో ఉన్న నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాల్గొన్న నేతలపై అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రకటించారు. ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ తదితరులు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖపై, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె అధిష్టానం తనపై చర్యలకు ముందుగానే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకే కలుస్తున్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X