వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తరిస్తున్న బాక్టీరియా మహమ్మారి..: విలవిలలాడుతున్న వన్యప్రాణులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Lion
ఇరాన్‌: ఇరాన్‌ లోని తెహ్రాన్ జూ (అటవీ మృగాల సంక్షరణ కేంద్రం)లో అంటు వ్యాధులు కలిగించే ప్రమాదకర బాక్టీరియా వన్యప్రాణులను, మృగరాజులను బలిగొంటుంది. ఇప్పటి వరకూ ఈ బాక్టీరియా బారినపడి 14 సింహాలు మృతి చెందినట్లు స్థానికి మీడియా వెల్లడించింది. ఈ బాక్టీరియా వ్యాధి పర్యాటకులకు సైతం సోకవచ్చునని ప్రభుత్వ రంగ మీడియా సంస్థ జామ్-ఈ జామ్ పేర్కొంది.

సింహాలు గ్లాండర్స్ (గుర్రాలకు సోకే ఒక అంటువ్యాధి) బారిన మృతి చెందినట్లు ఆ పత్రిక తెలిపింది. ఇతర జంతువులకు సైతం ఈ వ్యాధి సోకిందని, ఇది జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదముందని సదరు పత్రిక హెచ్చరించింది. జూలో వన్యప్రాణుల సంరక్షణ లోపం వల్ల సింహాలకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చునని గుర్రాల వైద్యుడు హావ్‌మ్యాన్ మోలౌక్‌పౌర్ తెలిపారు. అయితే ఈ సింహాలు ఎప్పుడు మరిణించాయనే విషయాన్ని మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు.

గడచిన రెండు నెలలో ఇలాగే మూడు సింహాలు గ్లాండర్స్ వ్యాధి సోకి మరణించినట్లు ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ అంతరించిపోతున్న అటవీ మృగాలను సంరక్షించికోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మోలౌక్‌పౌర్ అభిప్రాయపడ్డారు. లేకపోతే భావితరాలకు చరిత్రలో ఓ ఘట్టంగా మిగిలిపోయిన డైనోసార్లు మాదిరిగానే పులులు, సింహాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

English summary
Authorities put down 14 lions at the Tehran zoo that had been diagnosed with an infectious bacterial disease that could affect visitors, a local newspaper reported today. The state-own Jam-e Jam daily reported that the lions were suffering from glanders, a bacterial disease found in horses, donkeys, mules as well as other domesticated animals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X