హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్ర మంత్రిగా ఉండి జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారు: ఈటెల

By Pratap
|
Google Oneindia TeluguNews

Eetela Rajender
హైదరాబాద్: కేంద్ర మంత్రిగా ఉండి ఎస్ జైపాల్ రెడ్డి ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పదవులు తీసుకుంటారా, వదిలేస్తారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మంగళవారసం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఎజెండా పాతదే అయితే కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. ఆహ్వానం అందిన తర్వాత దానిపై స్పందిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ కోసం ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీన విద్యార్థుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన అన్ని విద్యార్థి సంఘాలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. జనవరి 29వ తేదీన నుంచి విద్యార్థి జెఎసి తరఫున తెలంగాణలో బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదలయ్యే జై బోలో తెలంగాణ సినిమాను తెలంగాణకు చెందిన అందరూ చూసేలా పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. విద్యార్థుల బస్సు యాత్రలు పది, 12 రోజుల పాటు సాగుతాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X