హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు ఫాక్షన్ లింక్స్, ఎమ్మెల్యేల కొనుగోలు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ కు ఫాక్షన్ లింకులున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ కొనుగోలు రాజకీయాలు చేస్తున్నరని, అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ ఫాక్షన్ లింకులు, కొనుగోలు రాజకీయాలు, అవినీతిపై ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే చర్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీశ్రేణులతో ఆయన గురువారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పెట్రో ధరల పెంపుదలపై పార్టీ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై ఆయన వారితో చర్చించారు. అవినీతి, ప్రజాసమస్యలపై రచ్చబండలో ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అవిశ్వాసానికి పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X