• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ సెగ: మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు దిగి పరుగో పరుగు

By Pratap
|

Ponnala Laxmaiah
వరగంల్‌: మంత్రులు పొన్నాల లక్ష్మయ్యకు, డికె అరుణకు వరంగల్‌లో శనివారం తెలంగాణ సెగ తగిలింది. రచ్చబండపై సమీక్ష రచ్చ రచ్చ అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ కాన్వాయ్‌లను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ తెలంగాణవాదులకు నాయకత్వం వహించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణవాదుల సెగకు పొన్నాల లక్ష్మయ్య కారు దిగి పరుగు పెట్టారు. పోలీసులు వినయ్ భాస్కర్ ‌పై చేయి చేసుకున్నారు. డికె అరుణతో తెలంగాణవాదులు వాగ్వాదానికి దిగారు.

అంతకు ముందుకు - రచ్చబండపై ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండపై సమీక్షకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం సమావేశం ఏర్పాటైంది. దీనికి హాజరైన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారు. దీనిపై వినయ్ భాస్కర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్సించారు.

సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి డికె అరుణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా తెలంగాణవాదులు నిలదీశారు. తెలంగాణవాదులను పోలీసులను అరెస్టు చేశారు. మీడియాను సమావేశంలోకి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మంత్రులు బయటకు రావాలంటూ మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు. పిలిచి అవమానిస్తారా అని వారు ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X