తెరాస ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Districts
oi-Pratapreddy
By Pratap
|
వరగంల్: రచ్చబండపై ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండపై సమీక్షకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం సమావేశం ఏర్పాటైంది. దీనికి హాజరైన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారు. దీనిపై వినయ్ భాస్కర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్సించారు.
సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి డికె అరుణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా తెలంగాణవాదులు నిలదీశారు. తెలంగాణవాదులను పోలీసులను అరెస్టు చేశారు. మీడియాను సమావేశంలోకి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మంత్రులు బయటకు రావాలంటూ మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు. పిలిచి అవమానిస్తారా అని వారు ప్రశ్నించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి