• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఇళ్లపై ఐటి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews
Priyanka Chopra-Katrina Kaif
ముంబై: బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఇళ్లపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ప్రియాంక, కత్రినా ఇళ్లకు చేరుకున్నారు. ఇరువురి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే ఐటి అధికారులు ఆ సినీ తారల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఆదాయం పన్నును ఎగవేశారనే అనుమానంతో ఐటి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కత్రినా, ప్రియాంక ఆర్థిక మేనేజర్లపై కూడా ఐటి శాఖ అధికారులు దృష్టి సారించారు. భారీ ఎండార్స్‌మెంట్ డీల్స్, పలు అంతర్జాతీయ ప్రదర్శనల నేపథ్యంలో వారిద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కత్రినా, ప్రియాంక చోప్రా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X