వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుషీ తండ్రి రాజేష్‌పై యువకుడి దాడి: అదుపులోకి తీసుకున్న పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aarushi
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హతురాలు అరుషీ తండ్రి రాజేష్ తల్వార్‌పై మంగళవారం ఉదయం పదిగంటల ప్రాంతలో ఒక గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి చేశాడు. అరుషీ కేసులో విచారణకు ఘజియాబాద్ కోర్టుకు వచ్చిన రాజేష్ తల్వార్‌పై ఆ యవకుడు దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా అరుషీ హత్య కేసులో తండ్రి రాజేష్ తల్వార్‌ను కూడా పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.

అయితే దాడి చేసిన యువకుడు అరుషీని ఆమె తండ్రి రాజేషే చంపాడాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాడి చేశారా, మరే విషయమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే రాజేష్‌పై దాడి కూడా సంచలనం సృష్టించింది. కోర్టు ఆవరణలోనే రాజేష్‌పై యువకుడు దాడి చేయడం రాష్ట్ర పోలీసులు భద్రతా చర్యలపై అందరూ పెదవి విరుస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X