వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా విశ్వవిద్యాలయంలో ఫ్రాడ్: తెలుగు విద్యార్థులే ఎక్కువ

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ వెలుగు చూసింది. అధికారులు సోదాలు చేసి, విశ్వవిద్యాలయాన్ని మూసేశారు. దీంతో వందలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. వీరిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికార వర్గాలు దర్యాప్తు చేపట్టి విశ్వవిద్యాలయంలోని వీసా పర్మిట్లను దుర్వినియోగ పరుస్తూ మనీ లాండరింగ్‌కు, ఇతర నేరాలకు విద్యార్థులు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఈ విశ్వవిద్యాలయం సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా శివారులోని ప్లెజంటోన్‌లో ఉంది. గతవారం ఈ విశ్వవిద్యాలయం మూత పడింది.

విశ్వవిద్యాలయంలో 1555 మంది విద్యార్థులుంటారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే. విద్యార్థులు వివిధ కాలిఫోర్నియాలో ఉన్నట్లు చెబుతూ రెసిడెన్షియల్, ఆన్‌లైన్ కోర్సుల్లో చేరారని, నిజానికి వారంతా అక్రమంగా మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో తేలింది. పలువురు భారతీయ విద్యార్థులను అధికారులు విచారించారు. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు.

కాగా, ఈ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులను ఆదుకోవడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ముందుకు వచ్చింది. తెలుగు విద్యార్థులకు చట్టపరిధిలో సహాయం చేయడానికి, తగిన సమాచారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా చెప్పారు. తాము ట్రై వ్యాలీ విద్యార్థులను సంప్రదిస్తున్నామని, తగిన సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. సహాయం అవసరమైన విద్యార్థులు ఆకులను సంప్రందించాల్సిందిగా ఆయన సూచించారు. లా కంపనీ నడుపుతున్న ఆకుల అండ్ అసోసియేట్స్ విద్యార్థులకు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన విద్యార్థులు ఆకులను 972-241-4698 అనే ఫోన్ నెంబర్‌పై గానీ [email protected] అనే ఇ - మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.

English summary
Hundreds of Indian students, mostly from Andhra Pradesh, face the prospect of deportation from the US after authorities raided and shut down a university in the Silicon Valley on charges of a massive immigration fraud. The Tri-Valley University in Pleasanton, a major suburb in San Francisco Bay Area, has been charged by federal investigating authorities with being part of an effort to defraud, misuse visa permits and indulge in money laundering and other crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X