హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాకు హీరో రవితేజ సోదరుడు భరత్ క్షమాపణలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bharat
హైదరాబాద్: దురుసుగా ప్రవర్తించినందుకు హీరో రవితేజ సోదరుడు భరత్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. హైదరాబాదులోని సోమాజిగుడాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన గురువారం సాయంత్రం క్షమాపణలు చెప్పారు. ఇక ముందు మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించబోనని ఆయన హామీ ఇచ్చారు. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించడం తప్పేనని, తనకు మీడియా పట్ల గౌరవం ఉందని ఆయన చెప్పారు.

డ్రగ్స్ కేసులో హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసుల విచారణకు హాజరైన భరత్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. వార్త సేకరించడానికి వచ్చిన మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. తమ విధులు నిర్వర్తించడానికి మాత్రమే వచ్చామని మీడియా ప్రతనిధులు చెప్పినా ఆయన వినలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X