హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంశంపై బొత్స సత్యనారాయణకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కారం తెలుగుదేశం చేతుల్లోనే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వాల్సిందీ, తేవాల్సిందీ కాంగ్రెస్సేనని, కేవలం తప్పించుకునేందుకే తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌ నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం సహకరించాలన్న రాష్ట్ర మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అని, తాము ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుచేశారు. తెలంగాణ దిశగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీల వైఖరేమిటన్నది చెప్పాల్సి వస్తుందన్నకారణంగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని కూడా పెట్టడం లేదని విమర్శించారు. తెలంగాణపై దొంగాట ఆడుతోంది కాంగ్రెస్‌ పార్టీయేనని ధ్వజమెత్తారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు వద్దన్నారని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాకే పరీక్షలు రాస్తామన్నారని అన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించడం గర్హనీయమన్నారు. మరోవైపు తెలంగాణ కోసం చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలపై తెలంగాణ సీనియర్‌ నేతలు బుధవారమిక్కడ ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. నాగంతో పాటు దేవేందర్‌ గౌడ్‌, మోత్కుపల్లి, కడియం, హరీశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేయడం, మండలస్థాయిలో ధర్నాల్లాంటివి నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు స్పందన లేదని, తెదేపా తెలంగాణ ఫోరం తరఫున ఆ కార్యక్రమాన్ని చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X