వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రినైన నాకే రక్షణ లేదు, సామాన్యుల గతేమిటో: శంకరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: మంత్రినైన తనకే రక్షణ లేదని, సామాన్యుల పరిస్థితి ఏమిటో భగవంతుడికే తెలియాలని చేనేత శాఖ మంత్రి పి. శంకర రావు అన్నారు. తనకు ఇటీవల నాలుగు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని, అయినా తనను పలకరించినవారు లేరని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అదుపు తప్పుతోందని ఆయన విమర్శించారు. తనకే రక్షణ ఇవ్వలేని పోలీసులు ప్రజలకేం చేస్తారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పట్ల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తాము వైయస్ బొమ్మ వల్ల గెలవలేదని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళ్తున్నవారు కూడా కేవలం వైయస్ బొమ్మ వల్లనే గెలవలేదని, కాంగ్రెసుకు ఓటు బ్యాంక్ ఉందని ఆయన అన్నారు. జగన్ వెంట వెళ్తున్నవారు అక్కడే ఉంటారా, తిరిగి వస్తారా అనేది వారి ఇష్టమని ఆయన అన్నారు. తనను ఎస్సీ కాదన్నవారి చరిత్ర విప్పుతానని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X