వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేలకు కొత్త లాప్‌టాప్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్‌: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయా శాసనసభ్యులకు లాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదివారం చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు కొత్త లాప్‌టాప్‌లు అందనున్నాయి. నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసేందుకు వీలుగా ఎమ్మెల్యేలకు ఈ సౌకర్యం కల్పించామని శాసనసభ ఉపసభాపతి తెలిపారు. లాప్‌టాప్‌తో పాటు ప్రింటర్‌, స్కానర్‌, ఫ్యాక్స్‌ తదితర సౌకర్యాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.

ప్రత్యేకించి నియోజకవర్గాల అభివృద్ధికోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటుందని మనోహర్‌ చెప్పారు. ఎమ్మెల్యేలకు వీటిపై శిక్షణ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. ఐదు రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X