రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనూష తల్లిదండ్రుల హత్య కేసులో ముద్దాయి రాజేష్‌కు జీవిత ఖైదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: పదహారు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అనూష తల్లిదండ్రుల హత్య కేసులో ముద్దాయి రాజేష్‌పై నేర నిరూపణ అయినట్లు సోమవారం రాజమండ్రి ఫ్యామిలీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో రాజేష్‌కు జీవిత ఖైదుని విధించింది. కాగా నేర నిర్ధారణ కావటంతో ఇలాంటి హత్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండాలంటే రాజేష్‌ను కఠినంగా శిక్షించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. విచారణ సుమారు 16 నెలలు కొనసాగింది. 27 మంది సాక్షులను కోర్టు విచారించింది. కాగా రాజేష్‌కు మరణ శిక్షగానీ, యావజ్జీవం గానీ పడే అవకాశాలున్నాయని అనూష తరఫు లాయరు భావించారు. అయితే కోర్టు యావజ్జీవం విధించింది.

కాగా కోర్టుకు వెళ్లేముందు రాజేష్ తాను ఏ హత్యకు పాల్పడలేదని విలేకరులతో చెప్పారు. తాను తప్పు చేయనందున తనకు శిక్ష పడదని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. అయితే అనూష మాత్రం నేరస్థుడు రాజేష్‌కు కఠిన శిక్ష పడాలని అభిప్రాయపడింది. ఇలాంటి దుర్మార్గానికి మరెవరూ పాల్గొనకుండా ఉండాలంటే రాజేష్‌కు కఠిన శిక్ష వేయాల్సిందేనన్నారు. తల్లిదండ్రులను చంపడం వలన నాకు, నా చెల్లెల్లు ఇద్దరికి తీవ్ర అన్యాయం జరిగిందన్నాడు.

కాగా అనూషను ప్రేమించమని రాజేష్ గత కొన్నేళ్లుగా హత్యకు ముందు వేధించాడు. తనను ప్రేమించాలని అనూష చుట్టూ తిరిగాడు. అయితే అనూష ఎంతకీ ఒప్పుకోక పోవడంతో రాజేష్ ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. ప్రేమ విషయమై అడిగాడు. అనూష ఒప్పుకోక పోవడంతో కత్తితో దాడికి ప్రయత్నించాడు. అయితే అనూషను చంపడానికి ప్రయత్నిస్తున్న రాజేష్‌కి తల్లిదండ్రులు అడ్డు రావడంతో వారిని పొడిచి చంపాడు. అనూష ఈ దుర్ఘటనలో తీవ్రగాయాల పాలయింది. ఈ దుర్ఘటనను మహిళాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాజేష్‌ని తీవ్రంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశాయి. అనూష తల్లిదండ్రులు చనిపోవడంతో అనూషను ఆమె ఇద్దరు చెల్లెల్లను కొందరు ఆదుకున్నారు. మురళీ మోహన్ వారిని చదివిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X