చర్లపల్లి జైలులో ఘర్షణ: ఐఎస్ఐ తీవ్రవాది సహా ముగ్గురికి గాయాలు

జైలులో సులేమాన్ అలీ బాయ్, వికారుద్దీన్‌ల వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఐఎస్ఐ తీవ్రవాదులు జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాపాగ్ని బ్యారక్‌లో జైలు సిబ్బందికి మూడు సెల్ ఫోన్లు, రెండు బుల్లెట్లు లభించాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు చెప్పారు.












Click it and Unblock the Notifications