హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీ దిగిపోవాలి: చిరు ఇంటికి ఆంటోనీ రావడంపై కాకా

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో స్నేహం చేయడానికి కాంగ్రెసు చేస్తున్న ప్రయత్నాలు అవమానకరంగా ఉన్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి ఇంటికి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ వెళ్లడం సిగ్గుమాలిన చర్య అని, ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని ఆయన విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఐదు రాష్ట్రాలకు మాత్రమే కాంగ్రెసు పరిమితమైందని, కాంగ్రెసు పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన అన్నారు. సోనియా నాయకత్వంపై తనకు విశ్వాసం పోయిందని ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందనే నమ్మకం లేకుండా పోయిందని, ఎన్నిసార్లు అడిగినా సోనియా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆంటోనీ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లేంతగా కాంగ్రెసు దిగజారిపోయిందని ఆయన అన్నారు. చిరంజీవిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడవచ్చు కదా, 125 ఏళ్ల పార్టీకి ఈ గతి పట్టడమేమిటని ఆయన అన్నారు. ఈ చర్యకు పార్టీ సీనియర్ నేతలంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యంతో పొత్తుపై అధిష్టానం ఇంతగా తొందరపడాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. బుద్ధి లేకుండా కాంగ్రెసును నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓసారి ఓడిపోతే ఓడిపోతాం, ఇందిరా గాంధీ హయాంలో కూడా ఓడిపోయామని, కానీ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బిక్షమడిగి చిరంజీవి బతిలాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఇద్దరు, ముగ్గురు పిల్లలతో ఎఐసిసి నడుస్తుందా, గ్రామగ్రామాన తిరిగి కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకున్న నాయకులతో మాట్లాడాల్సి ఉండిందని, వారి సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. చిరంజీవితో పొత్తు అంతా ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పరిస్థితి తలుచుకుంటే సిగ్గు పోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు ఇంతకు ముందు దక్షిణలు ఇచ్చేవారని ఆయన అన్నారు. దక్షిణలు వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చేవారా అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడిన చిరంజీవితో స్నేహం చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X