వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం వీసా ఫ్రాడ్‌కు భారతీయ ఉద్యోగి కారకుడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
వాషింగ్టన్: వీసా ఫ్రాడ్‌కు తమ భారతీయ సంతతి ఉద్యోగి ఒకరు కారణమని సిగ్గులేని విశ్వవిద్యాలయం ట్రైవ్యాలీ నిందిస్తోంది. వీసా ఫ్రాడ్‌లో విశ్వవిద్యాలయానికి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. వీసా ఫ్రాడ్‌ ఆరోపణలపై విశ్వవిద్యాలయం నెల రోజుల క్రితం మూత పడిన విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ మంది చదువుతున్నారు. ఇమిగ్రేషన్ అక్రమాలతో తమకు ఏ విధమైన సంబంధం లేదని, తాము విద్యార్థులను మోసం చేయలేదని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు సుసాన్ సూ అన్నారు.

తమ విశ్వవిద్యాలయం మూతకు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ (ఐసిఇ) తీసుకున్న చర్యల వల్ల లాభాల్లో నడుస్తున్న తమ విశ్వవిద్యాలయం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందని ఆయన అన్నారు. తమ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలోని స్టూడెంట్ అసిస్టెంట్ అంజిరెడ్డి, మరో విద్యార్థి రామ్ క్రిష్టా కర్రాతో కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఐసిఇ చర్యల కన్నా ముందే ఈ ఇద్దరిని తొలిగించినట్లు కూడా ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X