కాకా వ్యాఖ్యలపై కాంగ్రెసు అధిష్టానానికి నివేదిక పంపిన డిఎస్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ పార్టీ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా)పై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక పంపించారు. ఆ నివేదికకు కాకా వ్యాఖ్యల క్లిప్పింగులను కూడా జత చేశారు. కాకాపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.
కాకాపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీలో ఢిల్లీలో చెప్పారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మొయిలీ చేసిన విజ్ఞప్తిని కూడా కాకా తీసిపారేశారు. ఈ నేపథ్యంలో కాకాపై నివేదిక పంపాలని పార్టీ అధిష్టానం డిఎస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. కాకాపై ఏ మాత్రం జాప్యం చేయకుండా అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి