హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాపై కాకా వ్యాఖ్యలకు ఏడ్చిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నీరు కార్చారు. కాకా సోనియాపై చేసిన వ్యాఖ్యలను రోశయ్య ఖండించారు. కాకా చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపానికి లోనయ్యానని చెప్పారు. సోనియాపై కాకా వ్యాఖ్యలకు దేశంలోని ప్రతి కాంగ్రెసు కార్యకర్త మనస్తాపానికి గురయ్యారాన్నారు. కాకా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడవలసినది కాదన్నారు. తనను ఎంతో బాధించాయని చెప్పారు.

కాకా మాటలు చిన్నపిల్లల్లా ఉన్నాయని రోశయ్య ఎద్దేవా చేశారు. కాకా సోనియా గాంధీకి ఎంతో రుణపడి ఉండాలని చెప్పారు. ఆయన కుటుంబానికి కాంగ్రెసు పార్టీ, సోనియాగాంధీ ఎంతో చేశారన్నారు. ఆయన కొడుకులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం మరిచిపోయారా అన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయన తన స్థాయని మించి మాట్లాడారన్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X