హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెసు పార్టీ స్థాపనకు కాకా ప్లాన్ వేసుకున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్: పక్కా ప్రణాళిక ప్రకారమే కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపించే ఉద్దేశంతో ఆయన ముందుకు దూకినట్లు అనుమానిస్తున్నారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రాదని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గుర్తించాలని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించిన కాకా ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపిస్తానని చెప్పారు. కాళ్లు మొక్కుతా తెలంగాణ ఇవ్వాలని ఆయన సోనియాను వేడుకున్నారు. తెలంగాణ ఇస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ విషయంలో సోనియాపై చేసిన వ్యాఖ్యలను ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు స్వాగతించారు.

సోనియాపై తెలంగాణను ప్రధానం చేసుకుంటే తనకు అసంతృప్త నేతల నుంచి మద్దతు లభిస్తుందని, దాంతో పార్టీ పెట్టవచ్చునని వెంకటస్వామి ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు కుమారుడు జి. వివేక్ నుంచి కూడా మద్దతు లభించలేదు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ముంబైలో ఉన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. సోనియాపై తన తండ్రి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, సోనియా తెలంగాణ ఇస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. కుమారుడి నుంచే కాదు, ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా కాకాకు మద్దతు లభించలేదు. ఆయన ఒక్క మాట మీద ఎప్పుడూ నిలబడి ఉండకపోవడం బహుశా, ఆయనకు మద్దతు లభించకపోవడానికి కారణం కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X