జెసి దివాకర్ రెడ్డి మాణిక్య వరప్రసాద్ జి వెంకటస్వామి సోనియా గాంధీ కాంగ్రెసు హైదరాబాద్ jc diwakar reddy manikya varaprasad g venkataswamy sonia gandhi congress hyderabad
మతిభ్రమించింది, దారిన పోనే దానయ్య: కాకాపై జెసి దివాకర్ రెడ్డి

సీనియర్‌ను కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని ఆయన భావిస్తున్నట్టున్నారన్నారు. కాకా మాటలు లోకజ్ఞానం లేని వారు మాట్లాడినట్లుగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని లేఖ రాశారని జెసి అన్నారు. కాకా ఎప్పుడు మాట్లాడినా వ్యక్తిగత ప్రయోజనాలకోసమే ప్రెస్ మీట్లు పెడతారని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన వయసు రీత్యా మాట్లాడటం లేదని, కేవలం తనకు పదవి రాలేదనే అలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన సోనియాపై మాట్లాడటం తీవ్రమైన విషయం.