వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకాపై కఠిన చర్యలు తప్పవు: సోనియాపై వ్యాఖ్యల మీద వీరప్ప మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సీనియర్ పార్టీ నేత జి. వెంకటస్వామి (కాకా) చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెసు అధిష్టానం సీరియస్‌గా ఉంది. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. కాకా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించారని, అందువల్ల చర్యలు తీసుకోక తప్పదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తాను ఉదయం కాకాతో ఫోన్‌లో మాట్లాడానని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించానని, అందుకు కాకా నిరాకరించారని, ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో పొత్తు ప్రయత్నాలపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొయిలీ వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X