• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోనియా విదేశీయత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: కాకాపై అంజన్ ఫైర్

By Srinivas
|

Anjan Kumar Yadav
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామికి మతిభ్రమించి మాట్లాడుతున్నట్టున్నారని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్ బుధవారం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విదేశీ అన్న కాకాకు ఆయన పదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. విదేశీయతపై ఇన్నాళ్లకు గుర్తుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. తెలంగాణ పేరుతో, కాంగ్రెసు పార్టీలో ఉండి వెంకటస్వామి కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. ఆయన సంపాదనకు పదవులు బాగా ఉపయోగపడ్డాయన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానం దగ్గర పోరాడుతుంది ఒక్క తెలంగాణ కాంగ్రెసు ఎంపీలమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ కాకాకు ఏమీ తక్కువ చేయలేదన్నారు. ఓ కొడుకు మంత్రి అయ్యాడని, మరో కొడుకు ఎంపీ అయ్యాడని చెప్పారు. అయితే పదమూడేళ్లుగా గుర్తుకురాని సోనియా విదేశీయత ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. కాకా ఢిల్లీలో ఏ రోజు తెలంగాణగురించి మాట్లాడింది లేదన్నారు. పదవిలో ఉన్నప్పుడు డబ్బు సంపాదనకు తప్ప తెలంగాణ గురించి ప్రస్తావించింది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X