వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే జూలకంటి వాహనంపై కోడిగుడ్లు విసిరిన తెలంగాణవాదులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
నల్గొండ: సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కారుపై తెలంగాణవాదులు గురువారం కోడిగడ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో రచ్చరచ్చ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వేములపల్లి మండలం శెట్టిపాలెం రచ్చబండకు వెళ్లారు. అక్కడ పలువురు తెలంగాణవాదులు ఎమ్మెల్యే జూలకంటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా చేయాలన్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చాకే రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వాహనంపై కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X