• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాకా వ్యాఖ్యలు సమర్థనీయమే, చిరుతో తెలంగాణ వెనక్కి: ఉప్పునూతల

By Srinivas
|

Uppunuthala Purushotham Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి ప్రజారాజ్యంతో కాంగ్రెసు పొత్తు వలన తెలంగాణ రాదన్న వ్యాఖ్యలను మరో సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి గురువారం సమర్థించారు. సమైక్యవాదానికి జై కొడుతున్న చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీతో కలిస్తే తెలంగాణ వెనుక పడినట్లేనన్నారు. అయితే కాకా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియాపై కాకా అలాంటి వ్యాఖ్యలు చేయవలసినది కాదన్నారు. సోనియాపై ఆయన తొందరపాటు వ్యాఖ్యలు చేశారన్నారు.

కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణకోసం రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వారికి ఇదే సరైన సమయం అన్నారు. ఇప్పుడు రాజీనామాలకు సిద్ధపడితే తెలంగాణ సాధించుకుంటామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గం కన్నా ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గం అధ్వాన్నంగా ఉందన్నారు. పనికిరాని వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X