ఎవడబ్బ సొమ్మని సోనియాకు ముడుపులు: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ఎవడబ్బ సొమ్మని రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఏఐసిసి ఆధ్యక్షురాలు సోనియాగాంధీకి ముడుపులు పంపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు కిషన్ రెడ్డి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఏకీభవిస్తున్నదని చెప్పారు. సోనియాగాంధీకి పంపిన ముడుపులపై వెంటనే న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపిఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు.
8వ తేదిన ఫీజు రీయింబర్సుమెంటుపై ఇందిరాపార్కు వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్ట కిషన్ రెడ్డి చెప్పారు. యూపిఏ ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్డీయే హయాంలో 17వ హైదరాబాదులో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. త్వరలో ఎన్డీఏలోని అన్ని పార్టీలతో సమావేశం అవుతామని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి