హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి నిర్మూలించలేని మన్మోహన్ ప్రధానిగా క్షేమం కాదు: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఎవరైనా వాటాలు ఇస్తే వారి అవినీతిని కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. అవినీతిపై ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారన్నారు. వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ఇదీ కేంద్ర ప్రభుత్వం తీరు అని విరుచుకు పడ్డారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంటిపై, కంపెనీలపై ఆదాయపన్ను శాఖా అధికారులు రెండు సంవత్సరాల క్రితమే దాడులు చేశారని, అప్పుడు కూడా ఆయన అక్రమాలు ఏమీ బయటపడలేదన్నారు.

మళ్లీ అంతలోనే దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రభుత్వం అవినీతిపై ఎవరూ ప్రశ్నించకూడదా అన్నారు. ప్రభుత్వం అవినీతిపై నోరు నొక్కేందుకే ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఇలాంటి కక్ష పూరిత చర్యలకు తెలుగుదేశం పార్టీ బయపడదన్నారు. ఎవరీ తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగమని ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలపై రెండు నెలలకోసారి ఐటి దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు.

అవినీతిని ఎదుర్కొనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవిలో ఉండటం దేశానికి క్షేమకరం కాదని మరో సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రధాని వెంటనే దిగిపోవాలని చెప్పారు. మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో గత కొద్దిరోజులుగా ఆమరణ దిక్ష చేస్తున్న బిఇడి విద్యార్థులు తమ దీక్షను విరమించాలని మరో నేత కడియం శ్రీహరి కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X