వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాకాపై చర్యలుంటాయి, నామాపై కక్ష సాధింపు లేదు: విహెచ్

అవినీతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, టెలికం మాజీ మంత్రి రాజా అరెస్టే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆయన అన్నారు. టెలికం కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. జెపిసి అడిగే సమయంలో బిజెపికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి గుర్తుకు రాదా అని ఆయన అడిగారు. ఏ తప్పు జరిగినా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.