వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకాపై చర్యలుంటాయి, నామాపై కక్ష సాధింపు లేదు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జి. వెంకటస్వామి (కాకా)పై చర్యలుంటాయని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు చెప్పారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుపై ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు కూడా లేవని, నామా కంపెనీలపై ఆదాయం పన్ను శాఖ దాడులు చేయడం కక్ష సాధింపు చర్య కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నామా కంపెనీలపై, ఇంటిపై ఐటి దాడులు జరిగాయనే తెలుగుదేశం నాయకుల విమర్సను ఆయన ఖండించారు.

అవినీతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, టెలికం మాజీ మంత్రి రాజా అరెస్టే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆయన అన్నారు. టెలికం కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. జెపిసి అడిగే సమయంలో బిజెపికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి గుర్తుకు రాదా అని ఆయన అడిగారు. ఏ తప్పు జరిగినా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X