హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కాంగ్రెస్‌లో కలవటం వల్ల తెలంగాణకు లాభం: హరీష్‌రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటం వల్ల తెలంగాణ ఉద్యామానికి ఎలాంటి నష్టం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్‌రావు సోమవారం అన్నారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణ లెక్చరర్ల ఫోరం బస్సు యాత్రను ఉదయం హరీష్‌రావు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. టిఆర్ఎస్‌కు ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకా, కెకె ఎప్పుడు ఏమి మాట్లాడుతారో వారికే తెలియదన్నారు. కెకె మాటలను మేం పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన చిరంజీవి తెలంగాణలో తన పార్టీని కోల్పోయాడన్నారు. చిరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో తెలంగాణలోని పీఆర్పీ కార్యకర్తలు టిఆర్ఎస్‌తో పాటు వివిధ పార్టీలలో చేరిపోయారన్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే తెలంగాణకు మంచిదేనన్నారు. కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడిన చిరును చేర్చుకొని తెలంగాణపై వ్యతిరేకతను తెలియజెప్పిందన్నారు.

తెలంగాణకు ఇంతకాలం రెండు పార్టీలు వ్యతిరేకంగా ఉండేవని, ఇప్పుడు పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడం వల్ల ఒక శత్రువు తగ్గారన్నారు. సిపిఎం ఒక్కటే పార్టీ వ్యతిరేకంగా ఉన్నా దానికి ఒక్క సీటే ఉందన్నారు. టిఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రభుత్వానికి సహాయ నిరాకరణ తెలుపుతామని చెప్పారు. సోమవారం 200 ప్రాంతాల్లో సహాయ నిరాకరణ చేపట్టామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X