వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటపడిన మరో స్పెక్ట్రమ్ స్కామ్, అక్రమంగా ఎస్ - బ్యాండ్ కేటాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

S-Band Spectrum
న్యూఢిల్లీ: ఒక వైపు 2 - జి స్పెక్ట్రమ్ కుంభకోణం దేశాన్ని కుదిపేస్తుండగా, అంతకన్నా భారీ కుంభకోణం మరోటి వెలుగు చూసింది. అత్యంత అరుదైన ఎస్ - బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను బిడ్డింగ్ ఏదీ లేకుండా దేవాస్ మల్టీ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కట్టబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు కాగా తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇస్రో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తున్నామని, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పోరేషన్ బెంగళూర్‌కు చెందిన దేవాస్ అనే సంస్థకు మధ్య 2005 జనవరి 28వ తేదీన ఆ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం దేవాస్ కోసం రెండు ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు ఎస్ - బ్యాండ్‌లో 20 ఏళ్ల పాటు 70 మెగా హెర్జ్ స్పెక్ట్రమ్‌ను ఇస్రో కేటాయించాల్సి ఉంటుంది. ఈ సంస్థకు ఇస్రో మాజీ శాస్త్రీయ కార్యదర్శి ఎం.జి. చంద్రశేఖర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ బోర్డులో నాస్కామ్ మాజీ అధ్యక్షుడు కిరణ్ కార్నిక్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇస్రో జిశాట్ - 6, జీశాట్ -6ఎ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుంది. వీటిలో పదేసి చొప్పున ట్రాన్స్ పాండర్లను దేవాస్ సంస్థ వినియోగించుకుంటుంది.

దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన ఈ వ్యవహారంలో స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం బిడ్లను ఎందుకు పిలువలేదని కాగా ఇస్రోను ప్రశ్నించింది. సంస్థాగతమైన నియంత్రణలు పాటించలేదని తప్పు పట్టింది. కాంట్రాక్టు వివరాలు, ప్రధాని కార్యాలయానికి, అంతరిక్ష కమిషన్‌కు సరైన సమాచారాం ఇవ్వలేదని తెలిపింది.

English summary
UPA Government has to face another spectrum scam. CAG it's preliminary report points out the allocation of S - band spectrum to Devas multi media without bidding by ISRO. Due to the agreement of ISRO with Devas the loss to the Government will be RS 2 lakh crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X