వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే ఆ పేర్లు లేకుండా పార్టీ పెట్టు: జగన్‌కు మంత్రి శంకర్‌రావు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, కాంగ్రెస్ పార్టీ పేరు లేకుండా పార్టీని పెట్టుకోవాలని చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్‌రావు సవాల్ చేశారు. జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందని తెలుస్తోందని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కించపరిచేలా మాట్లాడిన జగన్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.

జగన్‌కు తన ప్రజాభిమానంపై నమ్మకం ఉంటే పార్టీ పేరులో వైఎస్, కాంగ్రెస్ పేరును ఎందుకు చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చేది సోనియా తెచ్చేది తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులను ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

English summary
Minister Shankar Rao challenged Ex member of Parliament YS Jagan to form party without late on YSR and Congress 
 
 name. He said people will not excuse Jagan for blaming Sonia gandhi and Congress. He hoped that Telangana bill will 
 
 be proposed in next Parliament session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X