వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్‌కు వరంగల్ రచ్చబండ సవాలే: అడ్డుకుంటామన్న తెలంగాణవాదులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
వరంగల్: ముఖ్యమంత్రి తన రచ్చబండ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో విరమించుకోవాలని పలువురు తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజలంతా తమకు రచ్చబండ వద్దని, కేవలం తెలంగాణ కావాలని ఏకకంఠంతో చెబుతుంటే ప్రభుత్వం మాత్రం రచ్చబండ కార్యక్రమాన్ని మొండి పట్టుదలతో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి వరంగల్‌లో తన రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని కోరారు.

కేంద్రం తెలంగాణ ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి రచ్చబండ మాత్రమే కాదని, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు. ప్రభుత్వం పట్టుదలకు పోయి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటే తప్పకుండా అడ్డుకొని తీరుతామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. సిఎం రచ్చబండను నిర్వహించాలని అనుకుంటే అది మరో మానుకోట అవుతుందని అంటున్నారు. రచ్చబండ పేరుతో ప్రజలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సిఎం ప్రజలను బలవంతంగా కార్యక్రమానికి తరలించకుండా స్వచ్చందంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సిఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహించే గ్రామంలో ఇంటికొకరు కాకుండా మనిషికొక్కరుగా పోలీసులు ఉన్నారని ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రద్దు చేసుకోవాలని కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా సిఎం తన రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు.

English summary
Telanganites demand CM Kirankumar Reddy to cancel his Rachabanda in Warangal district. they say "All the people of Telangana demanding for only Telangana, but not any government schemes. so Kiran must cancel his programme. If he will not cancel his programme, we obstruct him. If CM confident on democracy he must make his programme without police. Not only TRS and BJP is also demanding for cancel, Congress and TDP also demanding for cancel of Rachabanda."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X