వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రోకర్ పనులు మానుకో: ఎంపీ లగడపాటికి దేవినేని ఉమ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడితే సహించేది లేదని టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ప్రజారాజ్యం పార్టీలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఏదో ఒక జాతీయ పార్టీలో కలవాలని లగడపాటి మతిభ్రమించి మాట్లాడారన్నారు. లగడపాటి బ్రోకర్ పనులు మానుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్షతో వేలకోట్ల రూపాయలు సంపాదించిన లగడపాటి అదే టిడిపిని విమర్శించడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమేనన్నారు.

పర్చూరు శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కేంద్రమంత్రి పురంధేశ్వరి మంత్రి పదవి కాపాడటానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంలో బయల్పడుతున్న అవినీతిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయాలని సవాల్ చేశారు. చంద్రబాబుపై దగ్గుపాటి విమర్శలు చౌకబారు అన్నారు.

English summary
TDP senior leader Devineni Umamaheshwara Rao warned Vijayawada Parliament Member Lagadapati Rajagopal today. He said he developed byTDP, but now he is commenting against Chandrababu. He also challenged MLA Daggupati Venkateshwara Rao to write letter to AICC president Sonia Gandhi on corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X