హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి మీడియా కార్యాలయంలో తయారైన కొండా సురేఖ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వరంగల్ జిల్లా కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ రాసిన లేఖ సాక్షి మీడియాలో తయారైనట్లు తెలుస్తోంది. లేఖను రాసి, సురేఖతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లేఖలో తీవ్రంగా ధ్వజమెత్తిన సురేఖ మీడియా సమావేశంలో కాస్తా వెనక్కి తగ్గారు. సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఒక రకంగా, తమ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) చిరంజీవిని విమర్శలు చేసినట్లుగానే ఆమె మంగళవారం రాజీనామా చేశారు. ఆమె మాట తీరును బట్టి కాంగ్రెసుతోనే ఉండాలని ఆమె అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

పైగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఆమె ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవికి డిఎస్ అర్హుడు కారా అని ఆమె ప్రశ్నించారు. లేఖను తానే రాశానని, అయితే ఒక్కసారి చూసి తప్పులు దిద్దాలని తాను లేఖను సాక్షికి చెందిన రామకృష్ణా రెడ్డికి పంపానని ఆమె చెప్పారు. అది సాక్షి కార్యాలయంలో తయారు కాలేదని చెప్పారు. కాంగ్రెసు బాగుపడాలనే ఉద్దేశంతోనే తాను సోనియాకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. అయితే, తాను బంధుత్వం దృష్ట్యానే గతంలో డి. శ్రీనివాస్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. కానీ, ఆమె మూడు సార్లు డిఎస్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

ఒక్కేసారి విధేయతలు మారిస్తే బాగుండదనే ఉద్దేశంతోనే కొండా సురేఖ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఇప్పటి వరకు పాల్గొన్న సురేఖ హరిత యాత్రకు మాత్రం దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను యాత్రకు దూరంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఆమె అడుగులు క్రమంగా కాంగ్రెసుకు దగ్గరగా పడుతాయనే ప్రచారం ఇంకా ముమ్మరంగా సాగుతూనే ఉన్నది.

English summary
It is learnt that Congress MLA Konda Surekha's open letter sent to Sonia Gandhi is drafted in YS Jagan's Sakshi media office. It is very intereting that she took side of PCC president D Srinivs and praised him. She opposed the merger Prajarajyam in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X