• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హాస్యనటుడు బ్రహ్మానందంపై తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ జస్వంత్ రెడ్డి ఫైర్

By Pratap
|

Brahmanandam
హైదరాబాద్: తెలంగాణ సినీ కళాకారులను హింసిస్తున్నాడంటూ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందంపై తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ చైర్మన్ జస్వంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బ్రహ్మానందం ఆగడాలను సహించబోమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ నటులను బ్రహ్నానందం అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు చెందిన శివారెడ్డిని బ్రహ్మానందం అవమానించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు సినీ ప్రముఖులు కొందరు బ్రహ్మానందాన్ని వెనకేసుకొస్తున్నారని ఆయన విమర్శించారు.

బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించానని, తాను చిన్నపాటి పాత్రలు వేశానని ఆయన చెప్పారు. బ్రహ్మానందం శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నప్పటికీ బయటకు రావడానికి తాము సమయం కోసం చూశామని ఆయన అన్నారు. బ్రహ్మానందం ఆగడాలను సాగినవ్వబోమని ఆయన హెచ్చరించారు. జైహింద్ గౌడ్, అమ్రీష్ పురి కూడా ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.

English summary
Telangana Film Chamber chairman Jaswanth Reddy warned comedian Brahanandam to face dire consequences, if shoud not stop harrassing Telangana artists. He said that Brahmanndam was insulting co -stras, perticularly Telangana artists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X