హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కోసం పురంధేశ్వరిని, పల్లంరాజును వ్యతిరేకించిన వైయస్సార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత కేంద్ర మంత్రులు పురంధేశ్వరిని, పల్లంరాజును తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసులోకి తీసుకుని చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పట్లో వైయస్ లేఖ రాశారంటూ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ లేఖలోని చిరంజీవితో దోస్తీకి సంబంధించిన అంశాలను ఉండవల్లి బయటపెట్టి మిగతా విషయాలను వెల్లడించలేదు. ఆ విషయాలు ఏమిటనేది ఆరా తీసినట్లు ఓ ప్రముఖ దినపత్రిక చెప్పుకుని దానిలోని అంశాలను వివరిస్తూ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. పురంధేశ్వరికి, పల్లంరాజుకు కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వకూడదని వైయస్ ఆ లేఖలో సోనియాను కోరారట.

కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన పురంధేశ్వరికి, ఎస్ జైపాల్ రెడ్డికి ఇచ్చినట్లే పార్టీలో వస్తే చిరంజీవికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వైయస్ సూచించినట్లు ఆ పత్రిక రాసింది. అప్పట్లో తనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ఈనాడు రామోజీరావుపై పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా వైయస్ సోనియాకు సూచించినట్లు ఆ పత్రిక వార్తాకథనం తెలిపింది. పురంధేశ్వరి, పల్లంరాజుల విషయంలో వైయస్ ప్రతిపాదనను సోనియా గాంధీ పట్టించుకోలేదు. అయితే వైయస్ సూచించిన సాయి ప్రతాప్‌కు మాత్రం కేంద్ర మంత్రి పదవి దక్కింది.

English summary
According to a news report - Late YS Rajasekhar Reddy opposed present union ministers daggubati Purandeswari and pallam Raju. He appealed to Sonia Gandhi to keep them away from central cabinet. He proposed chiranjeevi and Unadavalli Arun kumar for Cabinet berths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X