ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పోలవరం సభకు 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఏలూరు‌: హరిత యాత్ర ముగింపు సందర్భంగా గురువారం పోలవరం వద్ద ఏర్పాటైన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బహిరంగ సభకు 15 మంది కాంగ్రెసు శాసనసభ్యులు హాజరయ్యారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా వచ్చారు. హరిత ప్రారంభ కార్యక్రమానికి 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరు కాగా, ఆ సంఖ్య ముగింపు సభ నాటికి 15కు చేరుకుంది. ప్రారంభ సభకు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాలేదు. ముగింపు సభకు మాత్రం మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు సబ్బం హరి కూడా హాజరయ్యారు.

పోలవరం వద్ద జరిగిన బహిరంగ సభకు శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కమలమ్మ, కుంజా సత్యవతి, శేషారెడ్డి, ఆళ్ల నాని, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు. సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు కూడా హాజరయ్యారు.

English summary
15 Congress MLAs attended YS Jagan's public meeting held today at Polavaram. Jagan completed his 70 KMs Haritha Yatra began three days back at Ravulapalem of East Godavari district. Two Congress MPs Sabbam hari and Mekapati Rajamohan Reddy also attended YS Jagan's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X