వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం పడిపోయే వరకు జగన్‌తో ఉంటా: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
ఏలూరు: దుర్మార్గ ప్రభుత్వం పడిపోయే వరకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూనే ఉంటానని గురువారం పోలవరం సాధనా యాత్ర ముగింపు సభలో అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెంట 1600 కిలోమీటర్ల మేర నేను పాదయాత్ర చేశానని, ఇప్పుడు జగన్ వెంట కూడా పాదయాత్ర చేస్తున్నానన్నారు. అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. జగన్ అందరికీ ఆశా కిరణంలా కనిపిస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. జగన్ రియల్ హీరో అని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఆయన అండతో పోలవరం సాధిస్తామన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 84 ప్రాజెక్టులు చేపట్టారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కార్యక్రమాలలు చప్పగా ఉన్నాయన్నారు. అదే జగన్‌కు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్ నాయకుడు అయ్యే వరకు ప్రజలు ఆయన వెంట నడుస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన వరం అన్నారు. రేపటి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వ్యక్తి జగన్ అన్నారు.

నా రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదన్నారు. అందరూ జగన్‌ను సమర్థించాలన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. జగన్ త్వరలో వచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారని చెప్పారు. భవిష్యత్తు నాయకుడు జగనే అన్నారు. జగన్ 30 ఏళ్లు పరిపాలిస్తారన్నారు. ఇలాంటి సభ ఏ జాతీయ నాయకుడికోగానీ అష్టకష్టాలు పడితే గానీ సాధ్యం కానిదన్నారు. మూడు నెలలు, మూడేళ్లు ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ సిద్ధమన్నారు.

English summary
Ambati Rambabu said that he would be with YS Jagan till the collapse of Kiran's government. He spoke in Polavaram Haritha Yatra meeting on Thursday. MLC Jupudi Prabhakar Rao said public see Jagan as future leader and MP Mekapati Rajamohana Reddy accused Congress government about Jagan issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X