వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేదురుమల్లి స్థానంలో ఆపద్బాంధవుడు: రాజ్యసభకు చిరంజీవి!

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఇటీవలే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేసిన చిరంజీవిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవికి ఉన్న ఇమేజ్‌ని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆయనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా సంతృప్తికరంగా ఉండక పోవచ్చు. అయితే కష్టకాలంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు చిరుకు అందుకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాల్సిందే. 2014 ఎన్నికలలో చిరంజీవి సిఎం అభ్యర్థి అన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికిప్పుడు కిరణ్‌ను తొలగించి చిరును మాత్రం ఆ సీటుపై కూర్చోబెట్టలేరు. దానికి ఏ కాంగ్రెసు నేత ఒప్పుకోరు కూడా.

చిరంజీవికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆయనను కేంద్రానికి పంపించేందుకు సోనియాగాంధీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించి, ఆయన స్థానంలో రాజ్యసభకు చిరును పంపించే దిశలో ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నేదురుమల్లి దీనికి సమ్మతిస్తారా లేదా అనేది చూడాలి.

English summary
Chiranjeevi may be replaced by Ex chief Minister Nedurumalli Janardhan Reddy in Rajya Sabha. Nedurumalli may get Governor post in return. Congress Party is thinking to sent NJR as governor, considering his age and experience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X