వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప, పులివెందులలో గెలుస్తాం: సోనియా గాంధీతో శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని న్యూఢిల్లీలో కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సోనియాకు చెప్పానన్నారు. పీఆర్పీ విలీనం, ఉప ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించామన్నారు. పిసిసి పదవీ కాలాన్ని పొడిగించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చానని చెప్పారు. రచ్చబండ జరుగుతున్న తీరును సోనియాగాంధీకి తెలియజేశానని చెప్పారు.

పీఆర్పీ విలీనం కాంగ్రెస్‌కు అదనపు బలమే కానీ కాంగ్రెస్ బలహీనం కాలేదని చెప్పారు. కొండా సురేఖపై చర్చించలేదని స్పష్టం చేశారు. కడప, పులివెందుల ఎన్నికలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీతో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని చెప్పారు. చిరంజీవికి అయినా, ఆయన పార్టీ నేతలకు అయినా అర్హతలను బట్టి పదవులు ఉంటాయని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారన్నారు. రచ్చబండను అడ్డుకోవద్దని కోరారు.

English summary
PCC president D Srinivas hoped that Congress would win in Kadapa by election. Today he met AICC president Sonia Gandhi, told her that he expressed his hope. He spoke with media after meeting with Sonia. He said Congress will consider Chiru and his leaders image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X