కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్షేమ పథకాల అమలుకే రచ్చబండ: కరీంనగర్ రచ్చబండలో సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కరీంనగర్: సంక్షేమ పథకాల అమలే రచ్చబండ ఉద్దేశ్యం అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం కరీంనగర్ జిల్లా పల్లెంపాడు రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. కాగా తీవ్ర ఉద్రిక్తత నడుమ ముగుస్తుందనుకున్న ముఖ్యమంత్రి కిరణ్‍‌కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా రచ్చబండ కార్యక్రమం భారీగా పోలీసుల మోహరింపు, కార్యక్రమంలో పాల్గొనే వారికి ఐడి కార్డులు, తెలంగాణవాదుల ముందస్తు అరెస్టుల కారణంగా చిన్నపాటి అలజడితో తప్ప ప్రశాంతంగానే జరిగింది. కరీంనగర్ జిల్లా పల్లెంకుంటలో సిఎం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించారు. అయితే కార్యక్రమంలో పాల్గొనే వారికి పోలీసులు పాసులు జారీ చేశారు. ఆ గ్రామాన్ని పూర్తిగా పోలీసుమయం చేశారు. తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అయినప్పటికీ కొందరు తెలంగాణవాదులు కార్యక్రమంలో తెలంగాణ నినాదాలు చేశారు.

సిఎం సంక్షేమ పథకాల అమలు తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎవరు అడ్డుకున్నా ఆగవని తేల్చి చెప్పారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం 51 లక్షల ఇళ్లు ఇచ్చిందని, 14 లక్షలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, మరో 4.70 లక్షలు సాంక్షన్ చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తామన్నారు. పావలా వడ్డీ తదితర ఫథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

English summary
Kiran Kumar Reddy told in a public meeting that the Rachabanda programme is to implement schemes. He participated in Pallempadu Rachabanda, which is in Karimnagar District. He opposed the obstructions to Racha banda facing from few people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X