ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వార్థంతో వెళ్లిన చిరంజీవా, ప్రజల కోసం వచ్చిన జగనా హీరో: లక్ష్మీపార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lakshmi Parvathi
ఏలూరు: వైఎస్ జగన్ శ్రీరామచంద్రుని వంటి వాడని దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి గురువారం పోలవరం సాధన కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ చేపట్టిన హరితయాత్ర ముగింపు సభలో అన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్‌కే మద్దతు ఇస్తానన్నారు. ఆయన ఎవరి రికమండేషన్ వలన నాయకుడు కాలేదన్నారు. ప్రజలు తయారు చేసుకుంటున్న నాయకుడన్నారు.

ఆయన తన స్వార్థం కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నాయకుడుగా మారుతున్నారన్నారు. ఈజిప్టులో నైలు స్వాతంత్రం కోసం ప్రజాస్వామ్యంలా ఉప్పొంగిన నైలు నది, ఇక్కడ జగన్ కోసం కృష్ణా నది ఉప్పొంగుతున్నదన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనదన్నారు. ఇది ఆసియాలోనే ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అన్నారు. ఇలాంటి ప్రాజెక్టుపై డెబ్బై ఏళ్లుగా ఎవరూ దృష్టి సారించలేదన్నారు. కానీ దివంగత వైఎస్ దీనిపై దృష్టి సారించారన్నారు. వైఎస్ లేని లోటును జగన్ పూడ్చుతున్నారన్నారు.

మూడు సంవత్సరాల పిల్లను, 125 సంవత్సరాల పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేశారని చిరంజీవిని, కాంగ్రెస్‌ను ఉద్దేశించి చెప్పారు. కానీ జగన్ మాత్రం అధికారం వద్దనుకొని తండ్రి చేసిన కార్యక్రమాలు సాధించుకోవడానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరిన చిరంజీవి హీరోనా, ప్రజల కోసం కష్టపడుతున్న జగన్ హీరోనా అని ప్రశ్నించారు. రాష్ట్రం వైఎస్ వంటి మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు.

వైఎస్ తర్వాత అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏలుతుందన్నారు. వైఎస్ మరణం తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పావలా నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రానికి జగన్ ఒక్కడే సరియైన నాయకుడున్నారు. మాట తప్పని, మడమ తిప్పని వంశం నుండి జగన్ వచ్చాడన్నారు.

English summary
YS Jagan had public support and all sections of Society was supporting Jagan, said Laxmi Parvathi, today at Polavaram of Haritha Yatra public meeting. She blamed Chiranjeevi for merger of Prajarajyam with Congress. She said State and Central governements were neglecting people after death of YSR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X