వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్, కరీంనగర్ బంద్, ఉద్రిక్తం: సిఎం రావద్దంటూ నినాదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన తెలంగాణలో తన రచ్చబండను రద్దు చేసుకోకుంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఏ కార్యక్రమం పెట్టినా తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారని, అయితే తెలంగాణపై నిర్ణయం చెప్పకుండా ఏ కార్యక్రమాన్ని స్వాగతించరని చెప్పారు. కాగా మహబూబాబాద్‌లో తెలంగాణ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రచ్చబండకు రావద్దని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రచ్చబండను ఎవరూ ఆమోదించడం లేదని వారు ఆరోపించారు. బలవంతంగా గ్రామస్తులను కార్యక్రమానికి తీసుకు వెళుతున్నారన్నారు. ఆయా గ్రామాలను పోలీసు క్యాంపులుగా మార్చారని దుయ్యబట్టారు. పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని వారు ప్రశ్నించారు. సిఎం పర్యటించే గ్రామాల్లో 144వ సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం చెప్పిన తర్వాతే రావాలని హెచ్చరించారు. సిఎం రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే వినయభాస్కర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయితే ఎమ్మెల్యే తప్పించుకొని వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

కాగా మంత్రి బస్వరాజు సారయ్య రచ్చబండను అడ్డుకోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఖచ్చితంగా ఇస్తుందని చెప్పారు. అయితే కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రితో రచ్చబండలో తెలంగాణ తీర్మానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమాన్ని ఎవరూ అడ్డుకోవద్దని సూచించారు. మహబూబాబాద్ ఘటన పునరావృతం కాదన్నారు. కాగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

English summary
Telanganites called for Warangal and Karimnagar bandh today. They warned CM Kiran Kumar Reddy to cancel Rachabanda in Telangana Districts. If he will ready to continue his rachabanda, they are ready to obstruct. In this situation police arrested Telanganites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X